
జనంపైకి దూసుకెళ్లిన కారు (VIDEO)
TG: మద్యం మత్తులో కారు నడుపుతూ జనంపైకి దూసుకెళ్లిన ఘటన బెంగళూరులో జరిగింది. ఓ గల్లీలో నుంచి వేగంగా వచ్చిన కారు.. అదుపు తప్పి ఎదురుగా డివైడర్ను ఢీకొట్టింది. గాల్లోకి ఎగిరి రోడ్డుకు అవతలి వైపు ఉన్న షాపులను ఢీకొట్టింది. రోడ్డు పక్కనే నిలబడి మాట్లాడుకుంటున్న ఆరుగురు టెకీలు, ఇద్దరు జొమాటోల డెలివరీ బాయ్స్ రెప్పపాటులో తప్పించుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.




