బావిలో దూకి వృద్ధురాలి ఆత్మహత్య

1చూసినవారు
బావిలో దూకి వృద్ధురాలి ఆత్మహత్య
ఇందల్వాయి: డొంకల్ గ్రామానికి చెందిన గొల్ల మల్లవ్వ(65) అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. సోమవారం సాయంత్రం వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన భర్త నడ్పిసాయిలు బావిలో భార్య మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై సందీప్ కథనం ప్రకారం, ఆమె అనారోగ్య సమస్యల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్