డిచ్పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ విశ్వవిద్యాలయం మెయిన్ క్యాంపస్, బిక్కనూరు సౌత్ క్యాంపస్, సారంగపూర్ క్యాంపస్ లతో పాటు అనుబంధ డిగ్రీ, పీజీ కళాశాలలకు వేసవి సెలవులను పొడిగిస్తూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి సర్క్యులర్ జారీ చేశారు. విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలలు ఈ నెల 1వ తేదీ నుంచి పునఃప్రారంభం కావాల్సి ఉండగా, వాటిని 8వ తేదీకి పొడిగించినట్లు ఆయన తెలిపారు. ఈ విషయాన్ని అధ్యాపకులు,
విద్యార్థులు గమనించాలని ఆయన కోరారు.