సీఎంతో రైతుల ముఖాముఖీకి సిద్ధం చేయాలి: కలెక్టర్

69చూసినవారు
సీఎంతో రైతుల ముఖాముఖీకి సిద్ధం చేయాలి: కలెక్టర్
ఈ నెల 16న నిర్వహించనున్న రైతు నేస్తం కార్యక్రమాన్ని పురస్కరించుకుని జిల్లాలోని అన్ని రైతు వేదికలను అందంగా ముస్తాబు చేయాలని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. శనివార కలెక్టర్ డిచ్ పల్లి మండలం నడిపల్లి, మోపాల్ మండల కేంద్రంలోని రైతు వేదికలను పరిశీలించారు. రైతు నేస్తం కార్యక్రమానికి ఆదర్శ రైతులతో పాటు, స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం రైతులతో ముఖాముఖి జరుపనున్నందున ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
Job Suitcase

Jobs near you