వారి కొయ్యలకు నిప్పు

591చూసినవారు
సిరికొండలో వానాకాలం సీజన్ లో వరి సాగుకు రైతులు సిద్ధమవుతుండగా, రబీలో వరి కోతల అనంతరం మిగిలిన కొయ్యలను రైతులు అనాలోచితంగా నిప్పు పెడుతున్నారు. దీనివల్ల భూసారం తగ్గి పంట దిగుబడి తగ్గుతుందని, భూమి సారవంతం కోల్పోయి పంటలు పండని దుస్థితి ఏర్పడుతుందని వ్యవసాయ అధికారి నరసయ్య హెచ్చరించారు. రైతులు కొయ్యలను తగలబెట్టకుండా, వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తే వాటిని ఎరువుగా మార్చుకోవచ్చని, భూసారం పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్