ధర్పల్లిలో గణేష్ మండపం వద్ద అన్నదానం

467చూసినవారు
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రం G K గురుడి రెడ్డి కాపు గణేష్ మండపం వద్ద శనివారం మాజీ ఎంపీపీ నల్ల సారిక హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా గణేష్ మండపం వద్ద యజ్ఞము, సత్యనారాయణ వ్రతం, పూజలు నిర్వహించారు. మండపం వద్ద యజ్ఞంలో కూర్చుని పూజలు నిర్వహించారు. అనంతరం గణేష్ యూత్ సభ్యులు ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జికె యూత్ సంఘo సభ్యులు, యూత్ సభ్యులు, మహిళలు, యువకులు, పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్