ధర్పల్లి మండపాలను సందర్శించిన మాజీ జడ్పిటిసి బాజిరెడ్డి జగన్

2చూసినవారు
ధర్పల్లి మండపాలను సందర్శించిన మాజీ జడ్పిటిసి బాజిరెడ్డి జగన్
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని మద్దూల్ తండాలో మంగళవారం వినాయక గణేష్ మండపం వద్ద యజ్ఞం, సత్యనారాయణ వ్రతం, అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి బాజిరెడ్డి జగన్, మాజీ ఎంపీపీ నల్ల సారిక హనుమంత్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు మండపాన్ని సందర్శించి, గణపయ్యకు మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, పాడిపంటలతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు. అనంతరం గణపయ్య ప్రసాదాన్ని స్వీకరించి, అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్