విస్తృత తనిఖీలు నిర్వహించిన ఎన్నికల సాధారణ పరిశీలకులు*

6చూసినవారు
విస్తృత తనిఖీలు నిర్వహించిన ఎన్నికల సాధారణ పరిశీలకులు*
గ్రామ పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకులు జీవీ. శ్యాంప్రసాద్ లాల్ మంగళవారం ఇందల్వాయి మండలంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల పనితీరు, నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉన్నందున గట్టి నిఘా, పకడ్బందీ సోదాలు జరపాలని సూచించారు. టోల్ ప్లాజా వద్ద చెక్ పోస్టును తనిఖీ చేసి, సోదాలలో పట్టుబడిన లిక్కర్ నిల్వల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :