ధర్పల్లివిలేజ్ కమిటీ చైర్మన్ కు సన్మానం

3చూసినవారు
ధర్పల్లివిలేజ్ కమిటీ చైర్మన్ కు సన్మానం
నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్ రూరల్ లోని ధర్పల్లి గ్రామ అభివృద్ధి కమిటీ నూతన చైర్మన్ గా ఎన్నికైన ఆర్మూర్ రంజిత్ ను, అతని పదవ తరగతి క్లాస్మేట్స్ ఆదివారం ఘనంగా సన్మానించారు. ధర్పల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా వారు రంజిత్ ను కోరారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, డిసిసి ఉపాధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాల్రాజ్, ధర్పల్లి సర్పంచ్ శ్రీనివాస్ ల సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని రంజిత్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ చైర్మన్ ఆర్మూర్ రంజిత్, క్లాస్మేట్స్, వార్డ్ మెంబర్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.