నిజామాబాద్: అంతర్ జిల్లా చోరి ముఠా నాయకుడి అరెస్ట్

59చూసినవారు
నిజామాబాద్: అంతర్ జిల్లా చోరి ముఠా నాయకుడి అరెస్ట్
అంతర్ జిల్లాల్లో చోరీలకు పాల్పడుతున్న ముఠా నాయకుడిని అరెస్ట్ చేసినట్లు డిచ్ పల్లి సీఐ మల్లేష్ తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన దాసరి మురళీకృష్ణ, నర్సయ్య, గణేష్, రాజేష్, రావుల శివ, సమ్మక్క, భవాని, రేణుక, నాగయ్య సులభంగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకుని, ముఠాగా ఏర్పడి నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట్, రాజన్న సిరిసిల్లా, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో ఐదునెలలుగా వరుస చోరీలకు పాల్పడుతున్నారు. మిగిలిన ముఠా సభ్యుల కోసం సీఐ మల్లేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టగా, మంగళవారం ఎస్సై సందీప్ సిబ్బందితో కలిసి ముఠాలోని నాయకుడు దాసరి మురళీకృష్ణను అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్