పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాలర్షిప్లకు కస్తూరిబా విద్యార్థుల ఎంపిక

1చూసినవారు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాలర్షిప్లకు కస్తూరిబా విద్యార్థుల ఎంపిక
నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్ రూరల్ లోని డిచ్పల్లి కస్తూరిబా గాంధీ బాలికల విద్యార్థులు ప్రతిభ ఆధారంగా అందించే స్కాలర్షిప్లకు ఎంపికయ్యారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖలీల్ వాడి బ్రాంచ్ ఆధ్వర్యంలో ఈ స్కాలర్షిప్లు అందించారు. 9, 10 తరగతుల విద్యార్థులకు ఒక్కొక్కరికి ₹5000, 7, 8 తరగతుల విద్యార్థులకు ఒక్కొక్కరికి ₹3000 చొప్పున స్కాలర్షిప్ మొత్తాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. పాఠశాల ప్రత్యేక అధికారి సవిత బుధవారం ఈ వివరాలు తెలిపారు. ప్రతిభను ప్రోత్సహిస్తున్న బ్యాంకుకు, పాఠశాల యాజమాన్యానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్