నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండల కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలను పద్మశాలి సంఘం అధ్యక్షుడు కొండ్యాల వినోద్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంతో పాటు సమాజ సేవలో ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం పాలకవర్గం, సభ్యులు, బిసి సెల్ పద్మశాలి అధ్యక్షుడు, మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.