మారుతి మందిరం దుకాణానికి లీజు వేలంపాట జనవరి 3న

131చూసినవారు
మారుతి మందిరం దుకాణానికి లీజు వేలంపాట జనవరి 3న
బోధన్ పట్టణంలోని మారుతి మందిరం దుకాణం సముదాయంలోని దుకాణం నంబర్ (1) కి రెండు సంవత్సరాల కాలపరిమితికి జనవరి 3న లీజు లైసెన్స్ వేలంపాట నిర్వహించనున్నట్లు ఈవో రాములు తెలిపారు. వేలంపాటలో పాల్గొనేవారు దరఖాస్తు ఫారం పూర్తిచేసి 3000/- చెల్లించాలి. దరఖాస్తు రుసుము తిరిగి ఇవ్వబడదు. వేలంపాట రోజున ముందుగా పాటాదారులు 1,00,000/- డిపాజిట్ చెల్లించి పాల్గొనాలి. ఆలయానికి బకాయి ఉన్నవారు వేలంపాటలో పాల్గొనడానికి అవకాశం లేదని, మరిన్ని వివరాలకు దేవస్థాన కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్