నిజామాబాద్ మండలం పాల్టా గ్రామానికి చెందిన మహమ్మద్ ఇస్మాయిల్ (53) శనివారం తన ఇంటి పైకప్పున ఉన్న రేకుల షెడ్డులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.