ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


కాకులు వాలని శివయ్య కొండ.. ఎక్కడుందో తెలుసా?
Apr 09, 2026, 11:04 IST/

కాకులు వాలని శివయ్య కొండ.. ఎక్కడుందో తెలుసా?

Apr 09, 2026, 11:04 IST
ఏపీలోని గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలో ఉన్న కోటప్పకొండ క్షేత్రంలో కాకులు వాలవనే వింత ఆచారం ఉంది. దీనికి కారణం గొల్లభామ శాపమని చరిత్ర చెబుతోంది. సతీదేవి వియోగంతో శివుడు ఇక్కడ 12 ఏళ్లు తపస్సు చేశాడని, అప్పుడు గొల్లభామ పాలను ఒలకబోసిన కాకిని చూసి కోపంతో శాపం పెట్టిందని, శివుడు తధాస్తు అన్నాడని పురాణం చెబుతోంది. శివుడు లింగ రూపంలో మారినప్పుడు గొల్లభామ శిలగా మారిందని, కోటి ప్రభలు వస్తేనే శివుడు కొండ దిగి వస్తాడని విశ్వాసం. శివుడు దక్షిణామూర్తిగా, బ్రహ్మచారిగా వెలిసిన ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయాలు ఉండవు, కాబట్టి ఇక్కడ పెళ్లిళ్లు కూడా జరగవు. ఇలాంటి ఆలయ విశేషాలను ప్రతి రోజూ సాయంత్రం 5 గంటలకు #Hidden Secrets of Telugu Temples ద్వారా తెలుసుకోవచ్చు.