సిరికొండ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ, ఓటింగ్ ప్రక్రియపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు మాక్ పోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బ్యాలట్ పేపర్లు, ఓటర్ల జాబితాలు, పోలింగ్ బూత్ల నిర్వహణ, ఓటు వేసే విధానాన్ని నేర్పించారు. ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియజేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని ఉపాధ్యాయులు తెలిపారు. ప్రిన్సిపాల్ గడ్డం రాజేష్రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.