నిజామాబాద్: యువతకు శుభవార్త

2చూసినవారు
నిజామాబాద్: యువతకు శుభవార్త
ఆర్మీలో చేరాలని కలలుగనే అభ్యర్థులకు శుభవార్త. 2027 రిక్రూట్‌మెంట్ ఏడాదికి సంబంధించి దరఖాస్తు గడువును ఏప్రిల్ 10 వరకు పొడిగించారు. ఆసక్తి గల యువత www.joinindianarmy.nic.in వెబ్‌సైట్‌లో వయస్సు, విద్యార్హత తనిఖీ చేసుకుని వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రిక్రూట్‌మెంట్ అంతా పారదర్శకంగా, మెరిట్ ప్రాతిపదికనే జరుగుతుందని, దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని అధికారులు తెలిపారు. దేశం కోసం పనిచేసే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.