వికసిత్ భారత్ లక్ష్యంగా, అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా సాగుతున్న నరేంద్ర మోదీ పాలన 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 11 సంవత్సరాల్లో జరిగిన దేశాభివృద్ధిపై బుధవారం నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్, వివిధ రంగాల నిపుణులతో జరిగిన చర్చాగోష్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల శంకర్, మాజీ రాష్ట్ర కార్యదర్శి మురళీధర్ గౌడ్ హాజరైయ్యారు.