నిజామాబాద్: వ్యభిచార గృహంపై పోలీసుల మెరుపు దాడి

17చూసినవారు
నిజామాబాద్: వ్యభిచార గృహంపై పోలీసుల మెరుపు దాడి
ఇందూరు నగర కార్పొరేషన్ శివారులోని లక్ష్మీప్రియ నగర్ కాలనీలో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు సిసిఎస్ పోలీస్ బృందం ఈ దాడులు నిర్వహించింది. ఈ దాడిలో ముగ్గురు విటురాళ్లు, ఇద్దరు విటులు, 6 మొబైల్ ఫోన్లు, రూ.33,010 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తులను, వస్తువులను తదుపరి చర్యల కోసం రూరల్ పోలీస్ స్టేషన్ కు అప్పగించారు.

సంబంధిత పోస్ట్