ఇందల్వాయి మండలంలోని గంగారాం తండా శివారులో 44వ జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని రవి పాటక్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. యూపీ దాబాలో పనిచేస్తున్న రవి, పని ముగించుకొని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దాబా యజమాని పరమేశ్వర్ పాండే ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.