రోడ్డు ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్

4చూసినవారు
డిచ్పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మధ్యాహ్నం సుమారు 3:20 గంటల సమయంలో రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ పై కామారెడ్డి నుంచి జక్రాన్ పల్లి వైపు వెళ్తుండగా, NH-44 పై నిజామాబాద్ వైపు ఉన్న మలుపు వద్ద ముందు వెళ్తున్న ఫోర్డ్ కారును తప్పించబోయే ప్రయత్నంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో యువకులు లారీ కింద పడి మృతి చెందారు. సీపీ సాయిచైతన్య సంఘటనా స్థలాన్ని పరిశీలించి, ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్