
ఆ రాష్ట్రాల్లో ఇంటి నుంచే ఓటు హక్కు !
అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలలో ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యం (హోమ్ ఓటింగ్) ప్రారంభమైంది. అస్సాంలో 85 ఏళ్లు పైబడిన 19,774 మంది వృద్ధులు, 6,638 మంది దివ్యాంగులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు రిటర్నింగ్ అధికారులు అనుమతి ఇచ్చారు. ఈ ప్రక్రియ ఏప్రిల్ 5 నాటికి పూర్తి కానుంది.




