ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేసీఆర్ ను ఉరితీయాలని అనడం సరికాదని, ఉద్యమకారుడిని అలా అంటే రక్తం మరుగుతుందని అన్నారు. రేవంత్ రెడ్డిని ఒకసారి కాదు, రెండు సార్లు ఉరితీయాలని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో అక్రమాలపై ప్రశ్నలు లేవనెత్తిన కవిత, బీఆర్ఎస్ మనుగడ కోసం కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరారు. తన రాజీనామా ఆమోదం కోసం మండలికి వచ్చిన ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.