నిజామాబాద్‌లో రోడ్డు ప్రమాదం

0చూసినవారు
నిజామాబాద్‌లో రోడ్డు ప్రమాదం
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని చంద్రాయన్‌పల్లి శివారు వద్ద బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. నాగ్‌పూర్ వైపు వెళ్తున్న ప్రైవేట్ అంబులెన్స్‌ను వెనుక నుంచి వచ్చిన మరో వాహనం వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో అంబులెన్స్ అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లడంతో షేక్ ఆరిఫ్ (26), షేక్ ఇస్మాయిల్‌బీ (48) తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్