ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


Apr 02, 2026, 05:04 IST/

వృద్ధురాలిపై కోతి దాడి.. వీడియో వైరల్

Apr 02, 2026, 05:04 IST
అడవుల నరికివేత, నీటి కొరతతో కోతులు ఎక్కువగా జనవాసాల్లోకి వస్తున్నాయి. పట్టణాల్లో కూడా ఇళ్లలోకి దూరి వస్తువులను దోచుకుంటున్నాయి. గుంపులుగా దాడులు చేస్తున్న కోతుల వల్ల గ్రామస్థులు విసిగిపోయారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఒక వానరం వీధిలోకి ప్రవేశించి నానా హల్ చల్ చేస్తుంది. అది ఒక వృద్ధురాలితో పాటు అక్కడున్న వారికి చుక్కలు చూపించింది. వానరం ఎక్కడి నుంచి వచ్చిందో కానీ అది ఇళ్లలో ఉన్న సందుల్లో ఎంట్రీ ఇచ్చింది. అక్కడున్న వారిపై దాడికి దిగింది. ఒక వృద్ధురాలు కోతితో నువ్వా నేనా..?.. అన్నట్లు గొడవకు దిగింది. కోతిని రాయిచ్చి, కర్రతో కొట్టేందుకు ప్రయత్నించింది. దీంతో వానరం కూడా నన్నే కొడ్తావా అంటూ ఆ వృద్ధురాలికి చుక్కలు చూపించింది.