ధర్పల్లిలో గంగమ్మ తల్లి పల్లకి సేవ: సర్పంచ్ శ్రీనివాస్ ఆకాంక్ష

585చూసినవారు
ధర్పల్లిలో గంగమ్మ తల్లి పల్లకి సేవ: సర్పంచ్ శ్రీనివాస్ ఆకాంక్ష
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో గంగమ్మ తల్లి పల్లకి సేవ సోమవారం ఘనంగా నిర్వహించారు. గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ చెలిమిల శ్రీనివాస్ పాల్గొన్నారు. భక్తులు ఉదయం నుంచే ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు, దేవి పారాయణం నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, పాడి పంటలు సమృద్ధిగా పండి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు.

సంబంధిత పోస్ట్