నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని తిరుపతి గణేష్ మండపాన్ని గ్రామ పంచాయితీ సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గణనాథునికి ప్రత్యేక పూజలు, యజ్ఞం, అన్నదాన సత్రంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ధర్పల్లి వీడీసీ విలేజ్ కమిటీ చైర్మన్ రంజిత్, గ్రామ ఉపసర్పంచ్ శ్రీకాంత్, వార్డు మెంబర్ మమతా రాజ్ కుమార్, యూత్ సభ్యులు పాల్గొన్నారు.