నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలంలోని ఎమ్మార్వో కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు బుధవారం విధులకు హాజరు కాకుండా ఒక ఆర్ఐ ఇంట్లో జరిగిన పెళ్లి వేడుకకు హాజరయ్యారు. దీంతో కార్యాలయానికి తాళం వేయాల్సి వచ్చింది. అయితే పనుల నిమిత్తం అక్కడికి వచ్చిన ప్రజలకు నిరీక్షణ తప్పలేదు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.