డాక్టర్ దాశరధి కృష్ణమా చార్య బ్యారక్ ని సందర్శించిన విద్యార్థులు

1చూసినవారు
డాక్టర్ దాశరధి కృష్ణమా చార్య బ్యారక్ ని సందర్శించిన విద్యార్థులు
నిజామాబాద్ జిల్లా సారంగపూర్ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు, ఉపాధ్యాయులు మంగళవారం జిల్లా జైలును సందర్శించారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య బ్యారక్ నంబర్ 18ని విద్యార్థులు పరిశీలించారు. దాశరథి జీవిత విశేషాలను, జైలు గదుల్లో ఆయన పడిన యాతనలను, నిర్బంధంలోనూ ఆయన రాసిన విప్లవ కవితాధారలను ఉపాధ్యాయులు వివరించారు. ఈ సందర్భంగా "నా తెలంగాణ కోటి రత్నాల వీణ" వంటి ప్రసిద్ధ కవితాపాదాలను విద్యార్థులు స్మరించుకున్నారు. దాశరథి పోరాట పటిమను ఉపాధ్యాయులు కొనియాడారు.

సంబంధిత పోస్ట్