రూరల్ ప్రజలకు ఆపదలో అండగా…

1చూసినవారు
రూరల్ ప్రజలకు ఆపదలో అండగా…
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ప్రజలు అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో, ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి వారికి అండగా నిలుస్తున్నారు. బుధవారం కంటేశ్వర్ బైపాస్‌లోని నిజామాబాద్ రూరల్ క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్‌కు సంబంధించిన 2 వేల దరఖాస్తులపై ఎమ్మెల్యే భూపతి రెడ్డి సంతకాలు చేశారు. దీని ద్వారా అర్హులైన వారికి ఆర్థిక సహాయం అందనుంది.