ధర్పల్లిలో గణనాథుడి మహ నిమజ్జనం

1చూసినవారు
ధర్పల్లిలో గణనాథుడి మహ నిమజ్జనం
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని గణేశుడి మహా శోభాయాత్ర ధర్పల్లి లో శుక్రవారం రాత్రి 11: 20 నిమిషాలకు అత్యంత వైభవంగా జరిగింది. 11 రోజులపాటు విశేష పూజలు అందుకున్న గణనాథుడు రాత్రి 11: 20 నిమిషాలకు గంగమ్మ చెరువులోనికి చేరుకున్నాడు. ప్రజలు అందరూ ఎంతో ఆసక్తిగా చూసిన 20 అడుగుల మహాగణపతి సిద్ధి, బుద్ధి కలిగి ఉన్న మహాగణపతిని సిద్ది బుద్ధి గణేష్ మండలి ఎస్ కే వై. సభ్యులు వారు లడ్డు వేలంలో రూ. 35, 200కు చాకలి కుంటోళ్ల చిన్న గంగారం సొంతం చేసుకున్నాడు. ఈ కార్యక్రమంలో చాకలి గణేష్ మండలి వారు, పెద్దలు, యువకులు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్