దుబ్బాకలో వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా జరిగింది

157చూసినవారు
దుబ్బాకలో వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా జరిగింది
నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామం శివారులో విశ్వబ్రాహ్మణ సంఘం మరియు గ్రామ ప్రజల సహకారంతో నూతన వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. మూడు రోజుల పాటు జరిగిన యజ్ఞ క్రతువులతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వీరధర్మజాస్వామి గారు, తంగళ్ళపల్లి శ్రీనివాసచారి, వడ్ల హన్మండ్లు చారి, బందనకంటి నరసింహాచారి, బొమ్మెనప్రసాద్ చారి, వెంకటేష్ చారి, నరేష్ చారి, దొంతుల గంగాదాస్ చారి మరియు పెద్ద ఎత్తున విశ్వకర్మ బంధువులు పాల్గొన్నారు. ఈ ఆలయ ప్రతిష్టాపన ఘనంగా జరిగింది.

సంబంధిత పోస్ట్