మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సింగ్ పల్లి గ్రామంలో చిన్న గంగారం ఇంట్లో దొంగలు పడినట్లు ఎస్సై సుస్మిత ఆదివారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. దొంగలు ఇంట్లోకి చోరబడి బీరువాను పగల గొట్టి 10 తులాల బంగారం ఎత్తుకుపోయినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని, వివరాలు సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.