తాళం వేసిన ఇంటికే కన్నం వేసిన దొంగలు బంగారం వెండి చోరీ

0చూసినవారు
నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఇస్లాం పుర కాలనీలో షేక్ అన్వర్ అనే వ్యక్తి ట్రాక్టర్ గ్యారేజ్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన తన కుటుంబాన్ని బ్యాంకు పని నిమిత్తమై తీసుకెళ్లి, తిరిగి వచ్చేసరికి ఇంటికి తాళం పగలగొట్టి, బీరువాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న నగదు, బంగారం, వెండి అపహరించుకుపోయినట్లు తెలిసింది. దొంగలు సుమారు 12 తులాల బంగారు నగలు, 20 తులాల వెండి నగలు, 12 లక్షల నగదు చోరీ చేసినట్లు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్