నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఇస్లాం పుర కాలనీలో షేక్ అన్వర్ అనే వ్యక్తి ట్రాక్టర్ గ్యారేజ్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన తన కుటుంబాన్ని బ్యాంకు పని నిమిత్తం ఇంటి నుండి తీసుకెళ్లి, తిరిగి వచ్చేసరికి ఇంట్లో దొంగలు బీరువాలు పగలగొట్టి, 12 తులాల బంగారు నగలు, 20 తులాల వెండి నగలు, 12 లక్షల నగదు చోరీ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.