కలప దుంగల పట్టివేత

0చూసినవారు
కలప దుంగల పట్టివేత
మోపాల్ మండలంలోని సిర్పూర్ అటవీ ప్రాంతం నుంచి చెట్లను నరికి, కలప దుంగలను అక్రమంగా తరలిస్తున్న న్యాల్కల్ గ్రామానికి చెందిన కర్రోళ్ల రాజును ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంయుక్త గురువారం పట్టుకున్నారు. రాజు తన ద్విచక్రవాహనంపై కలప దుంగలను తరలిస్తుండగా పట్టుకొని, కేసు నమోదు చేసి, రూ. 10వేలు జరిమానా విధించి, వాహనాన్ని విడుదల చేశారు. సిర్పూర్ సెక్షన్ పరిధిలో అక్రమంగా కలప దుంగలు రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :