టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మోపాల్ కు చెందిన మామిడి అర్వింద్, ఇప్రాత్ లు బైకు మీద నిజామాబాద్ నుంచి గన్నారం వైపు ద్విచక్రవాహనంపై వెలుతుండగా పోలీస్ బెటాలియన్ వద్ద టిప్పర్ వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అరవింద్ కి తలకు, ఇస్రాత్ కి భుజానికి తీవ్రగాయమైంది. అక్కడే ఉన్న తోటి వాహనదారులు అంబులెన్స్ కి సమాచారం ఇవ్వడంతో వారిని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.