జక్రాన్పల్లి, జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి రాజస్థాన్కు వెళ్తున్న ట్రావెల్ బస్సు, ముందు వెళ్తున్న ఐచర్ను ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో బస్సు క్లీనర్ మంగిలాల్, ఐచర్ డ్రైవర్ ఎండీ మస్తాకు గాయాలవగా, వారిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సులోని 25 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.