యంత్రం పంపిణీ చేసిన వార్డ్ సభ్యులు నిమ్మల వినయ్ గౌడ్

3చూసినవారు
యంత్రం పంపిణీ చేసిన వార్డ్ సభ్యులు నిమ్మల వినయ్ గౌడ్
రైతుల సంక్షేమం, వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించే లక్ష్యంతో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరి నాటే యంత్రంను ధర్పల్లిలో శుక్రవారం వార్డు నంబర్ సభ్యుడు నిమ్మల వినయ్ గౌడ్ రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ వరి నాటే యంత్రం వినియోగంతో తక్కువ సమయంలో అధిక విస్తీర్ణంలో నాట్లు వేయవచ్చని, శ్రమతో పాటు ఖర్చు కూడా తగ్గుతుందని తెలిపారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించి సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా అధిక దిగుబడులు, లాభాలు పొందాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్