నిజామాబాదు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. 26 మంది ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారంపరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకుంటూ, వారి వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కారించుకోవాలని తెలిపారు.