పోలీసు ప్రజావాణికి 34 ఫిర్యాదులు

219చూసినవారు
పోలీసు ప్రజావాణికి 34 ఫిర్యాదులు
విశాఖపట్నం పోలీసు కమిషనరేట్‌లో సోమవారం పోలీసు ప్రజావాణి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మొత్తం 34 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులను స్వీకరించిన పోలీసు కమిషనర్ సాయిచైతన్య, వాటి పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ల సీఐలు, ఎస్ఐలకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. సమస్యల స్థితిని అడిగి తెలుసుకుని, పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజలు ఎలాంటి పైరవీలు, మూడవ వ్యక్తి ప్రమేయం లేకుండా నిర్భయంగా పోలీసు సేవలను వినియోగించుకుని, చట్టప్రకారం సమస్యలను పరిష్కరించుకోవాలని సీపీ సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుశాఖ ప్రజలకు మరింత చేరువగా పనిచేస్తుందని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్