నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 27 నుండి 31 వరకు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో 84 కేసులను నమోదు చేశారు. వీరిని కోర్టులో హాజరుపరచగా, 84 మందికి రూ. 7,90,000 జరిమానా విధించారు. ఐదుగురికి వారం రోజుల జైలు శిక్ష పడింది. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, వాహన పత్రాలను సరిగ్గా ఉంచుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య సూచించారు.