కురుమ యువత గణేష్ మండలి ఆధ్వర్యంలో ఘనంగా యజ్ఞం

14చూసినవారు
కురుమ యువత గణేష్ మండలి ఆధ్వర్యంలో ఘనంగా యజ్ఞం
కురుమ యువత ఉత్సవ కమిటీ గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రత్యేక యజ్ఞ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని గణపయ్యను ప్రార్థించారు. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం 7. 30 గంటలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గణపయ్య ప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు. కార్యక్రమంలో కురుమ సంఘ సభ్యులు, యువత పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్