త్వరలో జిల్లాకు క్రీడా మైదానం ఏర్పాటు

6చూసినవారు
త్వరలో జిల్లాకు క్రీడా మైదానం ఏర్పాటు
నిజామాబాద్ క్రీడల అనంతరం పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, యువత చదువులతోపాటు క్రీడల్లోనూ చురుగ్గా పాల్గొనాలని సూచించారు. విద్యార్థులు తమ కాలేజీ సమయాన్ని వృథా చేసుకోకుండా క్రీడల ద్వారా శారీరక సామర్థ్యం, మానసిక తేజస్సు, ఉత్సాహం, సామాజిక చైతన్యం పెంపొందించుకోవచ్చని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలు, టూరిజం రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, నిజామాబాద్ జిల్లాలో రన్నింగ్ ట్రాక్స్, వాకింగ్ ట్రాక్స్ నిర్మాణాలకు నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం క్రీడారంగానికి భారీగా నిధులు కేటాయించిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీ సాయిచైతన్య, మేయర్ ఉమారాణి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్