డీసీసీ, సీసీసీ అధ్యక్షుల భాద్యతల స్వీకారణ

3చూసినవారు
డీసీసీ, సీసీసీ అధ్యక్షుల భాద్యతల స్వీకారణ
సోమవారం జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కె. నగేష్రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. మాజీ అధ్యక్షులు మానాల మోహన్రెడ్డి, కేశ వేణుల నుంచి బాధ్యతలను స్వీకరిస్తూ రిజిష్టర్లో సంతకాలు చేశారు. ఉదయం 10 గంటలకు మాధవనగర్ లోని సాయిబాబా మందిరంలో, గోల్ హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, మాధవనగర్ నుంచి కాంగ్రెస్ భవన్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్