నిజామాబాద్ నగరంలో దొంగల అలజడి నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున మూడో టౌన్ ఏరియాలోని గణేష్ జ్యువెలరీ షాప్ వద్ద దొంగలు షట్టర్ ధ్వంసం చేస్తుండగా, పోలీస్ పెట్రోలింగ్ వాహనం సైరన్ తో రావడంతో ముఠా పరారైంది. అంతకుముందు బుధవారం తెల్లవారుజామున ఖలీల్ వాడి ఏరియాలో ఏటీఎం చోరీకి యత్నించిన హర్యానాకు చెందిన ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ ముఠా గతంలో అనేక కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు గుర్తించారు. వీరు మొదట బొలెరో వాహనం చోరీ చేసి, నంబర్ ప్లేట్ మార్చి నిజామాబాద్ వచ్చారు.