జిల్లా కేంద్రంలోని ఒకటో ఠాణా పరిధి గాంధీచౌక్ సమీపంలో ఇటీవల జరిగిన కారు చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఒక నిందితుడిని అరెస్టు చేసి, అతని వద్ద నుంచి చోరీకి గురైన కారును స్వాధీనం చేసుకున్నారు. ఫిర్యాదుదారు తన కారులో రైల్వే స్టేషన్ నుంచి గాంధీచౌక్ వైపు వెళ్తుండగా, మార్గమధ్యంలో గుర్తు తెలియని వ్యక్తి ప్రయాణికుడిగా కారులో ఎక్కి తనను ఓ ప్రాంతానికి తీసుకెళ్లాలని కోరాడు.