ఎల్లమ్మ గుట్టకు చెందిన రేంగి లక్ష్మి అనే బాధితురాలు తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నగరంలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయినందున, ఇంటి నిర్మాణానికి పూజలు చేసుకున్నామని తెలిపారు. అయితే, కొందరు తమ పట్టాను అమ్ముకోవాలని ప్రయత్నించారని, అందుకు తాను నిరాకరించడంతో తనపై గుప్త నిధుల కోసం పూజలు చేశారని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ తప్పుడు ప్రచారాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.