ధర్పల్లి మండల విడిసి చైర్మన్‌గా ఆర్మూర్ రంజిత్ ఎన్నిక

928చూసినవారు
ధర్పల్లి మండల విడిసి చైర్మన్‌గా ఆర్మూర్ రంజిత్ ఎన్నిక
నిజామాబాద్ జిల్లాలోని ధర్పల్లి మండల విడిసి (VDC) చైర్మన్‌గా ఆర్మూర్ రంజిత్ ఏకగ్రీవంగా బుధవారం ఎన్నికయ్యారు. గ్రామ పెద్దలు, విడిసి సభ్యుల ఏకాభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా రంజిత్‌ను గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, సభ్యులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నూతన చైర్మన్ ఆర్మూర్ రంజిత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్