బాల్కొండ వేల్పూరులో 2024-25 ఆర్థిక సంవత్సర పనులకు ఆడిట్ పూర్తి

51చూసినవారు
బాల్కొండ వేల్పూరులో 2024-25 ఆర్థిక సంవత్సర పనులకు ఆడిట్ పూర్తి
బాల్కొండ వేల్పూరులో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మండలంలో జరిగిన పనులకు శనివారం ఆడిట్ నిర్వహించారు. కూలీలకు డబ్బులు సక్రమంగా చెల్లించారని గుర్తించారు. రిజిస్టర్లను గ్రామపంచాయతీలో సరిగ్గా నిర్వహించాలని, గత ఏడాది చనిపోయిన మొక్కల స్థానంలో కొత్తవి నాటాలని ఆదేశించారు. అకౌంట్ సమస్యల వల్ల డబ్బులు అందరికీ చెల్లించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సాయి గౌడ్, డిస్టిక్ విజిలెన్స్ ఆఫీసర్ నారాయణ, సోషల్ ఆడిట్ ప్రోగ్రాం మేనేజర్ అశోక్, అంబుడ్స్ మెన్ శ్రీనివాస్, ఎంపీడీవో బాలకిషన్, ఏపీఓ అశోక్, ఎస్ఆర్పి బాలు, టెక్నికల్ అసిస్టెంట్లు స్వరూప, ఫీల్డ్ అసిస్టెంట్లు, సీనియర్ మెట్లు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you